ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గుట్కా గోదాంపై పోలీసుల దాడులు.. ఒకరు అరెస్ట్​ - nellor

నెల్లూరు జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా గోదాంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 6 లక్షల 50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

By

Published : Apr 16, 2019, 5:30 PM IST

స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

నిషేధిత గుట్కాలను అక్రమంగా నిల్వ చేసిన గోదాంపై నెల్లూరు సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని సుందరయ్య కాలనీలో దాడులు నిర్వహించిన పోలీసులు... దాదాపు ఆరు లక్షల 50 వేల రూపాయలు విలువచేసే 30 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహేంద్ర బాబు అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్రమంగా గుట్కా విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details