కృష్ణా జిల్లా పులిగడ్డ వద్ద కృష్ణా నది వంతెనపై నుంచి నదిలోకి దూకబోయిన మహిళను పోలీసులు కాపాడారు. అవనిగడ్డ మండలం విశ్వనాథపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళ ఆత్మాహత్యాయత్నం చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ పుట్టి రాంబాబు, మహిళా కానిస్టేబుల్ కలిసి బాధితురాలిని కాపాడారు. బాధిత మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
నదిలో దూకబోతుండగా మహిళను రక్షించిన పోలీసులు - మహిళా ఆత్మహత్యాయత్నం
కుటుంబంలో మనస్ఫర్థల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సదరు మహిళను గమనించిన పోలీసులు కాపాడారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పులిగడ్డ వద్ద ఉన్న కృష్ణా నది వంతెన వద్ద చోటుచేసుకుంది.
నదిలో దూకబోతుండగా మహిళను రక్షించిన పోలీసులు
Last Updated : Oct 16, 2020, 9:35 AM IST