కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ నంద్యాలకు చేరుకుంది. ఈ కమిటీకి ఐజీ శంఖబ్రత బాగ్చి నేతృత్వం వహిస్తున్నారు. ఈనెల 3న కౌలూరు వద్ద రైలు కిందపడి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటికే నంద్యాల ఒకటో పట్టణ సీఐ సోమశేఖరరెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనపై నంద్యాలలో రెండ్రోజులుగా ముస్లిం సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రేపు మృతుల బంధువులను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పరామర్శించనున్నారు.
కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు విచారణ కమిటీ - నంద్యాలతో కుటుంబం ఆత్మహత్యపై విచారణ కమిటీ
కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐజీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ నంద్యాలకు చేరుకుంది. అర్ అండ్ బీ అతిథి గృహంలో ఇతర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
police-investigation-committee-reached-to-nandyal-
Last Updated : Nov 8, 2020, 8:54 PM IST