ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

'డర్టీహరీ' నిర్మాతపై కేసు నమోదు - డర్టీహరీ నిర్మాతపై కేసు న్యూస్

డర్టీహరీ సినీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లపై అతికించిన పోస్టర్లు అశ్లీలంగా... స్త్రీలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ నిర్మాతతో పాటు పబ్లిషింగ్​ ఏజెన్సీలపై కేసు నమోదు చేశారు.

'డర్టీహరీ' నిర్మాతపై కేసు నమోదు
'డర్టీహరీ' నిర్మాతపై కేసు నమోదు

By

Published : Dec 14, 2020, 5:31 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్​లో డర్టీహరీ సినీ నిర్మాత శివ రామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్లపై అతికించిన సినీపోస్టర్లు అభ్యంతరకరంగా... స్త్రీలను అవమానించేలా ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీహరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని పేర్కొంటూ నిర్మాతతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై కేసు నమోదు చేశారు. ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహని శర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details