మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గొల్లకుంట తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో బాలుడు మృతిచెందాడు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం మిచ్చినా.. అందుబాటులో లేమని సిబ్బంది బదులిచ్చారు. వెంటనే ఆటోలో జోగిపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోస్టు మార్టం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాలుడు పుల్కల్ మండలం సింగూరు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
మొబైల్ చార్జర్ పేలి విద్యార్థి మృతి - మెదక్
విద్యుదాఘాతంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. బాలుడు మృతి