వేటగాళ్ల విష ప్రయోగానికి 8 నెమళ్లు బలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లోని ఆర్కే-5 సింగరేణి గని సమీపంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేశారు. విషం కలిపిన వడ్ల గింజలు తిని నెమళ్లు చనిపోయినట్టు గుర్తించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.