కడప జిల్లా బద్వేల్ లోని ఓ పరుపుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు యంత్రంలో దూదిని పెట్టి శుభ్రం చేస్తుండగా.. ఆ వేడికి మంటలు చెలరేగాయి. కొంత మేర పాత సంచులు నిలువరించినా... పత్తి పూర్తిగా కాలిపోయింది. పరుపుల దుకాణం యజమాని వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం... కాలిపోయిన పత్తి - కడప జిల్లా
ఓ పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కడప జిల్లా బద్వేల్లో జరిగింది. ఈ ప్రమాదంలో పత్తి పూర్తిగా కాలిపోయింది.
పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం