ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు.. - హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ప్రమాదం

చుట్టూ మృతదేహాలు... అక్కడ ఓ పిల్లాడు. అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకి పోయాయి. అయినా అమ్మ లేవట్లేదు. ఇంటికెళ్దాం అమ్మా అంటూ ఏడుపు.. ఈ దృశ్యం చూస్తే ఎవరి మనసునైనా కలిచి వేస్తోంది.

అమ్మా..ఇంటికిపోదాం..  తల్లి మృతదేహం వద్ద పసివాడు..
అమ్మా..ఇంటికిపోదాం.. తల్లి మృతదేహం వద్ద పసివాడు..

By

Published : Dec 2, 2020, 3:21 PM IST

అతివేగం... ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హైదరాబాద్ ‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్‌కల్‌కు కారులో బయలుదేరగా.. కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వాహనాలను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ లారీని ఢీకొంది.

ఈ ఘటనలో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఓ పిల్లాడు వాళ్ల అమ్మ మృతదేహం పక్కన కూర్చోని ఏడుస్తున్నాడు. రా అమ్మా... ఇంటి కెళ్దామంటూ... బోరుమంటున్నాడు.. ఈ ఘటన ప్రస్తుతం అందరిని కలిచివేస్తోంది.

ఇదీ చూడండి: గూడూరులో భారీ పేలుడుతో కారు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details