శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బోరిగిపేట గ్రామంలోని మామిడి తోటలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ధాన్యం వ్యాపారి తమ్మినేని లక్ష్మణరావు(50)గా గ్రామస్థులు గుర్తించారు.
కాసేపట్లో వస్తానని ఆదివారం రాత్రి బయటకు వెళ్లిన లక్ష్మణరావు ఇంటికి తిరిగి రాలేదు. తెల్లవారు జామున మృతదేహం చెట్టుకు వేలాడుతుండటం గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మృతినికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలె కుమారుడి వివాహం అయ్యింది.