ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య - యాదాద్రి భువనగిరి నేర వార్తలు

సంతోషంగా పెళ్లి జరుగుతున్న ఓ ఇంట్లో మాంసం కోసం మర్డర్ జరిగింది. విందులో మాంసం సరిగా పెట్టకపోవడం ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మాంసం గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఫలితంగా ఆ పెళ్లి ఇల్లు రక్తమోడింది. ఆవేశంలో చేసిన దాడిలో ఓ వ్యక్తి అసువులు బాసాడు.

one-died-in
one-died-in

By

Published : Dec 2, 2020, 9:19 AM IST

పెళ్లి ఇంట్లో మాంసం సరిగా పెట్టలేదనే గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. మాంసం సరిపోలేదనే గొడవ ముదిరి గొడ్డలి దాడి దాకా వెళ్లింది. వివాహం జరుగుతున్న ఇంట్లో రక్తం చిందింది. ఈ దారుణ ఘటన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సూరారం ప్రవీణ్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై మోహన్ తెలిపారు.

ఇదీ వివాదం...

దాచారం గ్రామానికి చెందిన సూరారం చంద్రయ్య ఇంట్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లికూతురుని తీసుకువచ్చేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి వెళ్లారు. అక్కడ భోజనాల సమయంలో మాంసం సరిగా పెట్టలేదని దాచారం గ్రామానికి చెందిన సూరారం వెంకటయ్య గొడవపడ్డాడు. ఆ గొడవ బంధువుల చొరవతో సద్దుమణిగింది. దాచారం చేరుకున్న తర్వాత సూరారం వెంకటయ్య మళ్లీ విషయాన్ని లేవనెత్తడంతో వివాదం తలెత్తింది.

శృతిమించిన దాడి..

ఆగ్రహించిన సూరారం వెంకటయ్య కొడుకు ప్రవీణ్ గొడ్డలితో సూరారం కిష్టయ్యపై దాడి చేశాడు. కర్ర, గొడ్డలితో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మరికొందరు కలగజేసుకున్నారు. సూరారం పరుశరాములుకు మెడపై, చెవి వద్ద గాయాలయ్యాయి. సూరారం నాగరాజుకు ఎడమ చేతిపై గాయం అయింది.

ఒకరు బలి

ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. గాయాలపాలైన ఇరువురిని మోత్కూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూరారం పరుశరాములు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:పేదల ఇళ్ల నిర్మాణానికి కనీసం 2 సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details