ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పాడేరులో రూ. కోటి విలువ చేసే గంజాయి పట్టివేత - పాడేరులో భారీగా గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న రెండు వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పాడేరు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

one crore value cannabis seized by paderu police
పాడేరులో రూ. కోటి విలువు చేసే గంజాయి పట్టివేత

By

Published : Nov 20, 2020, 10:08 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాడేరు జూనియర్ కళాశాల వద్ద పోలీసలు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన ఓ వ్యాన్​ చోదకులు.. వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. అందులో సుమారు 2 వేల కిలోల గంజాయిని గుర్తించారు. ఫలితంగా వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు. పరారైన డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ కోటి రూపాయలపైనే ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details