కృత్రిమ గర్భధారణ కోసం యువతితో ఒప్పందం కుదుర్చుకున్న ఓ వృద్ధుడు ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. తనతో సహజ సిద్దంగానే పిల్లల్ని కనాలని బలవంతం చేశాడు. ముసలోడి కుట్ర తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్వరూపరాజ్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. ఈ ఘటన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనంద్‌నగర్‌లో జరిగింది.
సరోగసి పేరుతో సరసమాడాడు.. - latest crime news in Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్లో ఓ వినూత్న ఘటన వెలుగులోకి వచ్చింది. సరోగసి సాకుతో... ఓ 64 ఏళ్ల వృద్దుడు.. 23 ఏళ్ల యువతిని బలవంతం చేయబోయాడు. ముగ్గురు ఆడపిల్లలకు తండ్రి అయిన నిందితుని తీరుపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకును కనాలనే సాకుతో తన నీచబుద్ధి బయటపెట్టుకున్న.. ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.
![సరోగసి పేరుతో సరసమాడాడు.. old man miss behave with lady in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6138671-475-6138671-1582192560983.jpg)
స్థానికంగా నివసిస్తున్న స్వరూపరాజ్ అనే 64 ఏళ్ల వృద్దుడికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. అయితే కొడుకు కావాలనే ఉద్దేశంతో.. తన మిత్రుడైన నూర్తో మధ్యవర్తిత్వం కుదుర్చుకున్నాడు. 23 ఏళ్ల యువతితో కృత్రిమ గర్భధారణకు రూ.5లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. వీటికి తోడు వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు రూ.పదివేలు ప్రసవం జరిగేంత వరకు చెల్లిస్తాన్నాడు.
యువతిపై మోజు..
ఆ యువతిని చూసిన తర్వాత స్వరూపరాజ్ తన అసలు బుద్ధిని బయటపెట్టాడు. ఒప్పందం ప్రకారం కృత్రిమ గర్భధారణ కాకుండా 'నువ్వే కావాలని' ఆ యువతిని ఇబ్బంది పెట్టాడు. వేధింపులను భరించలేని బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు స్వరూపరాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.