ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

చంచల్​గూడ జైలుకు నౌహీరా షేక్ - heera groups

సంచలనం సృష్టించిన హీరా గ్రూప్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్​ను... కర్ణాటకలోని బళ్లారిలో విచారణ అనంతరం హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలుకు తరలించారు.

nouhira_shek_in_chanchalaguda_prison

By

Published : Jul 13, 2019, 5:35 PM IST

చంచల్​గూడ జైలుకు నౌహీరా షేక్

హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్​ను హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆమెను బళ్లారి పోలీసులు పీటీ వారెంట్​పై హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని హోస్పేట్ తీసుకెళ్లారు. బళ్లారిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన అనంతరం తిరిగి ఈరోజు ఉదయం హైదరాబాద్​కు తీసుకొచ్చారు. బంగారంపై పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపిన నౌహీరా షేక్.... వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. ఆమెపై తెలుగు రాష్ట్రాలతో పాటు... కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు... హీరా గ్రూప్స్ అక్రమాలను గుర్తించారు. కేసులో నౌహీరా షేక్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details