మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) ఆచూకీ మంగళవారం కూడా దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలుడి తల్లికి ఇంటర్నెట్ ఫోన్ కాల్ చేసిన ఆగంతకుడు మళ్లీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేశాడు. డబ్బులు సిద్ధం చేసుకున్నారా? రేపు(బుధవారం) మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేశాడని తెలిసింది. ఆ ఇంటర్నెట్ కాల్‌ను ట్రాక్ చేసేందుకు జిల్లా ఐటీ కోర్ విభాగం పోలీసులు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల సైబర్ క్రైం నిపుణుల బృందం మంగళవారం పట్టణంలోని పలు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారం దొరకలేదని సమాచారం.
- దగ్గరి వ్యక్తులేనని అనుమానం..
తన కుమారుడిని దగ్గరి వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని బాలుడి తండ్రి రంజిత్ పట్టణానికి చెందిన ఐదుగురి పేర్లను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనతో చాలాసార్లు చూసిన వ్యక్తి కావడంతోనే బాబు కూడా రమ్మనగానే బైక్ ఎక్కి వెళ్లి ఉంటాడని ఆయన చెబుతున్నారు. ఈ కోణంలోనే పోలీసులూ విచారణ చేపట్టారు.
- బృందాలుగా విడిపోయి విచారణ..