ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

వాగులో ఆడుకుంటూ తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు - Nine years boy stuck in flood water in suryapeta district latest news

సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఓ బాలుడు వరద నీటికి వాగులో గల్లంతయ్యాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

వాగులో ఆడుకుంటూ తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు
వాగులో ఆడుకుంటూ తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు

By

Published : Oct 22, 2020, 11:32 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు వాగులో గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొర్నె ప్రవీణ్​ చిన్న కుమారుడు వరుణ్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బిక్కేరు వాగులో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో వరుణ్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై డానియేల్ కుమార్ సమక్షంలో గాలింపు చర్యలు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details