ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి! - వనపర్తి జిల్లా

అమావాస్య వచ్చిందంటే చాలు అతడికి ఆ రోజు రక్తమే ఆహారం. ప్రతి అమావాస్య రోజు మేకలు, గొర్రెల గొంతులు కోసి రక్తం తాగుతాడు. ఇప్పటికీ 50 మూగజీవాల ప్రాణం తీశాడు. గ్రామస్థులకు అతడి తీరుపై అనుమానం వచ్చి నిలదీశారు. అసలు బండారం బయటపెట్టాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

new-moon-come-and-drink-man-who-drinks-blood

By

Published : Oct 15, 2019, 7:26 PM IST

అమావాస్య వచ్చిందంటే చాలు.. రక్తం తాగే మనిషి!

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామానికి చెందిన కమ్మరిరాజు అనే వ్యక్తి మూగజీవాల రక్తం తాగుతూ జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అమావాస్య వచ్చిందంటే చాలు గొర్రెలు, మేకల గొంతుకోసి వాటి రక్తం తాగుతున్నాడు. అలా ఇప్పటికీ 50 మూగజీవాల ప్రాణం తీశాడు. రాజు తీరుపై అనుమానం వచ్చిన గ్రామస్థులు అతడిని నిలదీయగా నాలుగైదు సంవత్సరాలుగా ఇలా మూగజీవాల రక్తం తాగుతున్నట్లుగా వివరించాడు.


కుటుంబ సభ్యుల అసహనం
రాజు ఆగడాలపై కుటుంబీకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు చేష్టలతో ఎన్నోసార్లు చనిపోయిన మేకలు, గొర్రెలకు పరిహారం చెల్లించామని వాపోతున్నారు. రాజు మానసిక స్థితి బాగాలేదని... అతడికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబీకులు కోరుతున్నారు.

భయపడుతున్న గ్రామస్థులు
రాజు వింత ప్రవర్తనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. రక్తానికి అలవాటు పడిన అతడు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని రాజు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు!

ABOUT THE AUTHOR

...view details