ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య - Hyderabad Murder Latest News

తెలంగాణలోని సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

died

By

Published : Nov 3, 2019, 12:46 PM IST

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు... వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో విషాదం నింపింది. నిన్న రాత్రి నవీన్ గౌడ్, చోటు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన నవీన్​ గౌడ్​ మామ రమేశ్ గౌడ్ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. ఈ సమయంలో చోటు అనే వ్యక్తి రమేశ్​​ను బలంగా కొట్టడం వల్ల అక్కడిక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

బాధితుడు చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details