ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

యువకుడిని చెరువులో చంపి పడేసింది.. ఎవరు? - విశాఖ జిల్లానేరవార్తలు

ఓ యువకుడు.. కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కొడుకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకస్మాత్తుగా యువకుడు శవమై తేలాడు. ఇంతకీ ఆ యువకుడి మరణానికి కారణం.. ప్రేమా? ఇంకేదైనా?

murder in vishaka district narsipatnam
murder in vishaka district narsipatnam

By

Published : Aug 11, 2020, 5:51 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన గార కిశోర్ హత్య సంచలనం రేపింది. కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన కిశోర్ పట్టణ సమీపంలోని పెద్దచెరువులో శవమై తేలాడు. ఆగస్టు నాలుగో తేదీన కిశోర్ అదృశ్యమయ్యాడు. ఏడో తేదీన తల్లిదండ్రులు నర్సీపట్నం పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన స్థానిక పెద్ద చెరువులో పోలీసులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. నర్సీపట్నం ఎస్సీ కాలనీకి చెందిన కిశోర్ మృతదేహంగా గుర్తించారు. అసలు కిశోర్​ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆరా తీయగా.. కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.

కిశోర్ తల్లిదండ్రులు రోజువారి కూలీలు. పదో తరగతి వరకూ చదువుకొని కిశోర్ ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక పోలీస్ క్వార్టర్స్​లో ఉంటున్న యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. యువతి బంధువులే కిశోర్​ను హతమార్చి.. చెరువులో పడేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం నర్సీపట్నం పోలీస్​ స్టేషన్ ఎదుట బైఠాయించి.. ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కిశోర్ ప్రేమించిన యువతితోపాటు ఆమె తల్లి సహా మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...

ABOUT THE AUTHOR

...view details