ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

వాహనం ఢీకొని రెండేళ్ల కుమారుడితో పాటు తల్లి మృతి - mother and son dead in kamareddy district news

గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండేళ్ల కుమారుడితో పాటు తల్లి మృతి చెందిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-kamareddy  telanagana
-kamareddy telanagana

By

Published : Oct 23, 2020, 3:18 PM IST

బతుకుదెరువు కోసం కూలికి వెళ్లి పండగ కోసం ఇంటికి తిరిగివెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో సిరిసిల్ల రహదారి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తల్లి, కుమారుడు చనిపోయారు. మృతులు నాగర్‌కర్నూలు జిల్లా బీజనేపల్లి మండలం శానిపేట్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

మేస్త్రీ వెంకటయ్యతో కలిసి శానీపేట్‌కు చెందిన కుర్మయ్య భార్యపిల్లలతో మహారాష్ట్రకు 9నెలల క్రితం పనికి వెళ్లారు. దసరాకి 12 మంది కూలీలు డీసీఎంలో.. మహారాష్ట్ర నుంచి బయలుదేరారు. కాలకృత్యాల కోసం ఉదయం కామారెడ్డిలో వాహనాన్ని నిలిపారు. రోడ్డుదాటి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని నర్సమ్మతో పాటు ఆమె చిన్న కుమారుడు అక్కడకిక్కడే చనిపోయారు. మృతదేహలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details