తెలంగాణ: కరోనా బాధితురాలితో వార్డుబాయ్ ఆసభ్య ప్రవర్తన - Gandhi Hospital news
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలితో వార్డుబాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యుడు అతన్ని పట్టుకోగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ మహిళా కార్మికులు ఆరోపించారు.
![తెలంగాణ: కరోనా బాధితురాలితో వార్డుబాయ్ ఆసభ్య ప్రవర్తన కరోనా బాధితురాలితో వార్డుబాయ్ ఆసభ్య ప్రవర్తన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9020886-163-9020886-1601628545933.jpg)
కరోనా బాధితురాలితో వార్డుబాయ్ ఆసభ్య ప్రవర్తన
కరోనా బాధితురాలి పట్ల వార్డుబాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 2న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆరో అంతస్తులో విధులు నిర్వహించే సమయంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. అక్కడే విధుల్లో వైద్యుడు అతన్ని పట్టుకుని ఆస్పత్రి ఉన్నతాధికారులకు అప్పగించారు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పనిచేసే మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. అదే ఆస్పత్రిలో యూనియన్ నాయకుడు కావడంతో కేవలం మందలించి వదిలేశారని ఫిర్యాదు చేశారు.