గుంటూరు జిల్లాలో ఇద్దరు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తాడేపల్లిలోని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న సయ్యద్ మస్తాన్ వలితో పాటు ఉర్దూ అకాడమీ పరిపాలనాధికారిగా ఉన్న షేక్ జాఫర్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరు ఉర్దూ ఆకాడమీ నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ నూర్ బాషా ఫెడరేషన్ ఛైర్మన్ అలీ అక్బర్ బాషా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు... ఇద్దరు అధికారులను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. గతంలో సయ్యద్ అలీ ఉర్దూ ఆకాడమీకి ఇన్ఛార్జ్ డైరెక్టరుగా పనిచేశారు.
ఉర్దూ అకాడమీలో అక్రమాలు..ఇద్దరు అధికారులు అరెస్ట్ - ap cid latest news
గుంటూరు జిల్లాలో ఇద్దరు మైనార్టీ సంక్షేమ అధికారులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం ఆరోపణలపై సయ్యద్ మస్తాన్ వలీతో పాటు షేక్ జాఫర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
![ఉర్దూ అకాడమీలో అక్రమాలు..ఇద్దరు అధికారులు అరెస్ట్ minority welfare officers arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10098514-389-10098514-1609606706971.jpg)
minority welfare officers arrested