ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఫేస్‌బుక్‌ వల.. బాలుని కోసం బాలిక సుదూర ప్రయాణం - ప్రేమకోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక

ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్‌ఫోన్‌ ఓ బాలికను తప్పుదారి పట్టించింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన బాలుడు.. బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తాను ఉండే ప్రాంతానికి రప్పించుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన కూతురు కన్పించకపోవడంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు వెలుగు చూసింది.

minor-girl-escaping
minor-girl-escaping

By

Published : Dec 23, 2020, 12:07 PM IST

తెలంగాణ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13), స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఇంట్లోనే ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్​ఫోన్‌ కొన్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(16).. బాలికకు మాయమాటలు చెప్పి ఆరు మాసాలుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక బయటకు వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ దొరక్కపోవడంతో అదేరోజు రాత్రి మొయినాబాద్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

స్నేహితురాలికి ఫోన్‌ చేయడంతో..

బాలిక.. నేరుగా హైదరాబాద్​ జూబ్లీబస్టాండ్‌కు చేరుకుంది. తనవద్ద డబ్బు అయిపోవడంతో అక్కడే ఉన్న బేకరీ యజమాని ఫోన్‌తో కరీంనగర్‌లోని బాలుడికి విషయం చెప్పింది. బేకరీ యజమాని చరవాణికి బాలుడు ఫోన్‌పే ద్వారా రూ.400 పంపించాడు. రాత్రి 10 గంటలకు బాలిక కరీంనగర్‌ చేరుకుంది. అనంతరం బాలుడు నేరుగా బాలికను తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతకుముందు బాలిక తన స్నేహితురాలికి సైతం బేకరి యాజమాని ఫోన్‌ నుంచి మాట్లాడింది. దీంతో స్నేహితురాలి చరవాణికి వచ్చిన నంబరు ఆధారంగా ఏఎస్సై శ్రీశైలం.. జూబ్లీబస్టాండ్‌కు చేరుకొని బేకరి యజమానితో మాట్లాడారు. కరీంనగర్‌కు చెందిన యువకునితో ఫోన్‌లో మాట్లాడటంతో అదేరోజు రాత్రి పోలీసులు కరీంనగర్‌కు చేరుకుని బాలికను సురక్షితంగా మొయినాబాద్‌కు తీసుకువచ్చారు.

ఇదీ చూడండి:తహసీల్దార్‌ వినూత్న ఆలోచన... ప్రమాణ పత్రంతో లంచాలకు అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details