ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మారుతీరావు విషం తీసుకుని చనిపోయారా? - Nalgonda District today latest news

మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తైంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు తెలంగాణలోని మిర్యాలగూడ తీసుకెళ్లారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్​ టీం సేకరించిన ఆధారాలతో దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Tg_Hyd_54_08_Ci_On_Maruthi_Rao_Death_Av_3181326
Tg_Hyd_54_08_Ci_On_Maruthi_Rao_Death_Av_3181326

By

Published : Mar 9, 2020, 3:20 PM IST

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు విషం తీసుకుని చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు సైఫాబాద్ సీఐ చింతల సైదిరెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి విషం బాటిల్‌ దొరకలేదన్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్ టీంతో తనిఖీలు చేయించామన్నారు.

మారుతీరావు విషం తీసుకుని చనిపోయారా?

పరుపుపై వాంతులు చేసుకుని పడి ఉన్న మారుతీరావును ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సీఐ స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తైంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు మిర్యాలగూడ తీసుకెళ్లారు.

ఇదీ చూడండి :పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారేమో!

ABOUT THE AUTHOR

...view details