ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణలో విషాదం.. పెళ్లైన 20 రోజులకే వివాహిత మృతి..! - పెళ్లైన 20 రోజులకై వివాహిత ఆత్మహత్య

తెలంగాణలో ప్రేమ వివాహం చేసుకున్న కేవలం 20 రోజులకే ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రామారావునగర్​లో ఘటన జరిగింది.

married-women-suicide-at-sanatnagar-hyderabad
married-women-suicide-at-sanatnagar-hyderabad

By

Published : Dec 4, 2019, 1:18 PM IST

పెళ్లైన 20 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి..

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో విషాదం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న 20 రోజులకే అన్నపూర్ణ అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తోన్న ఆమె స్థానిక రామారావునగర్​లో నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో శవమై కనిపించింది. అన్నపూర్ణ 20 రోజుల క్రితమే దాసరి కార్తిక్​ అనే స్థిరాస్తిని వ్యాపారిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నపూర్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.. సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వివాహిత మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

మెడ, తలపై గాయాలు..

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి మెడ, తలపై గాయాలున్నట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భర్త కార్తిక్​ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మృతురాలి ఇంట్లో ఓ సూసైడ్​ నోట్​ దొరికిందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.

ఇదీ చూడండి:

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!

ABOUT THE AUTHOR

...view details