హైదరాబాద్ హిమాయత్ నగర్ కూడలిలో ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీపుర్లు అమ్ముకుంటున్న ఓ యువకుడు కూడలిలో అటుగా వెళ్తున్న ఓ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించాడు.
అక్కడే ఉన్న స్థానికులకు బాధితురాలు విషయాన్ని చెప్పగా.. ఆ యువకున్ని చితకబాదారు. నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు.