ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గ్రామస్థుల కళ్ల ముందే.. వాగులో పడి కొట్టుకుపోయాడు! - Man drowns in Vishwanathpur vagu

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం విశ్వనాథ్​పూర్​లో విషాదం చోటుచేసుకుంది. సమీపంలోని వాగులో గ్రామస్థులు చూస్తుండగానే.. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

గ్రామస్థుల కళ్ల ముందే.. వాగులో పడి కొట్టుకుపోయాడు!
గ్రామస్థుల కళ్ల ముందే.. వాగులో పడి కొట్టుకుపోయాడు!

By

Published : Sep 27, 2020, 12:00 AM IST

వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం విశ్వనాథ్​పూర్​ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగు వంతెన మీదుగా వరద ప్రవహిస్తోంది. విశ్వనాథ్​పూర్​ గ్రామానికి చెందిన జహంగీర్ (45) వరద ఉద్ధృతి గమనించకుండా వాగు దాటేందుకు ప్రయత్నించాడు.

మధ్యలోకి రాగానే.. నీటి ఉద్ధృతికి తట్టుకోలేక వాగులో పడి కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే జహంగీర్​ గల్లంతయ్యాడని, అతణ్ని కాపాడలేకపోయామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జహంగీర్ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.

గ్రామస్థుల కళ్ల ముందే.. వాగులో పడి కొట్టుకుపోయాడు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details