ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ప్రియుడిపై కత్తితో దాడి... ఆపై ఆత్మాహత్యాయత్నం! - challapally crime news

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని... అతన్ని ఓ యువతి చంపేయాలని చూసింది. అనుకున్న తడవుగా పథకం పన్నింది. చివరిసారిగా మాట్లాడుకుని ఇక విడిపోదాం అని చెప్పి ఇంటికి పిలిచింది. తీరా వచ్చాక కత్తితో దాడి చేసింది. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేసింది.

murder attempt
ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియురాలు

By

Published : May 26, 2020, 9:08 AM IST

పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యువతి దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సంచలనం సృష్టించింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. యువతి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. యువకుడు తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.

రెండేళ్లుగా ఇరువురికీ పరిచయం ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి.. అతనిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు సదరు యువకుడు తిరస్కరించాడు. చివరిసారిగా కలిసి మాట్లాడుకుని విడిపోదామంటూ పిలిచింది. సరేనంటూ వక్కలగడ్డ వెళ్లన అతనిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసింది. అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను.. మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details