ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట కథ విషాదాంతం అయింది. కలిసి బతకలేని పరిస్థితుల్లో చావే శరణ్యమనుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరిచలేదని యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువులో జరిగింది.
పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. పెద్దలను ఒప్పించి ఒక్కటవ్వాలనుకున్నారు. ఎన్నో ప్రేమ కథల్లాగే వీరికి అవాంతరాలు ఎదురయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చావులో ఒక్కటయ్యారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక ఉసురు తీసుకున్నారు.
పెద్దలు అంగీకరించలేదని... ప్రేమజంట ఆత్మహత్య
మొద్దులచెరువు శివారులో ఉరేసుకుని యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడు చివ్వెంల మండలం చందుపట్ల వాసి ఓర్సు నవీన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు సూర్యాపేట పోలీసులు తెలిపారు.