ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు.. అమాయకుడిని అంతమొందించాడు.. - మహబూబాబాద్​ జిల్లాలో పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు హత్య

ఒక వ్యక్తిని భయపెట్టేందుకు.. అతను చూస్తుండగా.. మరొక వ్యక్తిపై దాడిచేయడంలాంటి దృశ్యాలు సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఇదే తరహాలో ఓ వ్యక్తి పాశవికంగా వ్యవహరించాడు. స్థల వివాదం నేపథ్యంలో పొరుగింటి వ్యక్తిని భయపెట్టేందుకు.. అభంశుభం తెలియని మరో పరిచయస్తుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు.. అమాయకుడిని అంతమొందించాడు..
పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు.. అమాయకుడిని అంతమొందించాడు..

By

Published : Aug 25, 2020, 11:27 PM IST

ఏపీ అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న(46).. పది సంవత్సరాల క్రితం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వచ్చి కాగితాలు, అట్టలు ఏరుకుని విక్రయిస్తూ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇదే మండలంలోని గిర్నితండాకు చెందిన ఆంగోతు హరీష్‌కు వెంకన్నతో పరిచయం ఉంది. కొంతకాలంగా హరీష్‌కు తన ఇంటి పక్కన ఉన్న కర్పూరపు గోపాల్‌తో ఇంటి స్థల విషయమై వివాదం ఉంది.

ఈ నేపథ్యంలోనే గోపాల్‌ను భయపెట్టి స్థలాన్ని కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వెనుక ఎవరూలేని వెంకన్నను హతమార్చడం ద్వారా.. గోపాల్‌ని భయపెట్టాలని కుట్ర పన్నాడు. ఆదివారం రాత్రి వెంకన్నను తన ఇంటికి పిలిచి ఇద్దరూ మద్యం సేవించారు. తర్వాత హరీష్‌ పారతో వెంకన్న మెడపై నరికి అతి దారుణంగా హత్య చేసి కత్తితో తల, మొండెం వేరు చేశాడు. మొండాన్ని పక్కనే ఉన్న గోపాల్‌ ఇంటి స్థలంలో, తలను సంచిలో పెట్టుకుని మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ సమీపంలోని ఓ ఇంటి పక్కన పడేశాడు. సోమవారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ABOUT THE AUTHOR

...view details