తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అపహరణకు గురైన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేశారు. ఎర్రంపాటు - పుట్టపాడు మార్గంలో శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలిలో చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట.. పోలీసులు ఓ లేఖను గుర్తించారు. ఇన్ఫార్మర్గా ఉన్నందుకే హత్య చేసినట్లు లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈనెల 8 రాత్రి 10 గంటల సమయంలో శ్రీను ఇంటికి వచ్చిన సుమారు 15 మంది మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మావోయిస్టుల చేతిలో.. తెలంగాణ ఎంపీటీసీ హతం - కిడ్నాప్ చేసిన ఎంపీటీసీని హత్య చేసిన మావోలు
నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఎంపీటీసీ శ్రీనివాసరావుని మావోయిస్టులు హతమార్చారు. ఇన్ఫార్మర్గా ఉన్నందుకే హత్య చేసినట్లు వారు పేర్కొన్నారు.
telangana mptc died in hands of mavoists