ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పాత్రికేయుడు నవీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు... ప్రధాన ముద్దాయి వైకాపా నేతే - krishna district crime news

పాత్రికేయుడు గంటా నవీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలేకరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా మాగల్లు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, వైకాపా నాయకుడు కొమ్మినేని రవిశంకర్‌గా తేల్చారు. ప్రస్తుతం రవిశంకర్ పరారీలో ఉన్నారు. కేసులో పాత్రధారులు, సూత్రధారులైన ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

journalist-naveen-murder-case
పాత్రికేయుడు నవీన్ హత్య కేసును చేధించిన పోలీసులు

By

Published : Jun 29, 2020, 6:05 PM IST

ఈనెల 14వ తేదీన హత్యకు గురైన కృష్ణాజిల్లా మునగచర్ల గ్రామానికి చెందిన పాత్రికేయుడు గంటా నవీన్ కేసులో (ప్రధాన నిందితుడిని మినహా) నిందితులను నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాలనేరస్థుడితో కలిపి మొత్తం తొమ్మిది మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. గతంలో ఏ2, ఏ3లను అరెస్టు చేయగా... ప్రస్తుతం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రధాన నిందితుడిగా ఉన్న నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, ప్రముఖ వైకాపా నాయకుడు కొమ్మినేని రవిశంకర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మంది ముద్దాయిలను చూపగా... అందులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా... మిగిలిన ఎనిమిది మందిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టుల నేపథ్యంలోనే నవీన్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:'ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయటం దారుణం'

ABOUT THE AUTHOR

...view details