ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

'జస్టిస్​ ఫర్​ దిశ' కేసులో వేగవంతమైన విచారణ - జస్టిస్​ ఫర్​ దిశ కేసులో వేగవంతమైన విచారణ

సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు జస్టిస్​ ఫర్​ దిశ హత్య కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు వీలైనంత త్వరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

investigation
investigation

By

Published : Dec 2, 2019, 8:03 AM IST

'జస్టిస్​ ఫర్​ దిశ' కేసులో వేగవంతమైన విచారణ
జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యాచారం, హత్య కేసులో విచారణ వేగవంతం చేసినట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల పోలీసులు వీలైనంత త్వరగా అభియోగపత్రం రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఘటనాస్థలంలో బాధితురాలికి సంబంధించిన వస్తువులు మొదలుకొని హత్య అనంతరం ఆమెను దహనం చేసేందుకు నిందుతులు పెట్రోల్‌బంక్‌లో ఇంధనం కొన్న ఆధారాలు సహా అన్ని సేకరిస్తున్నారు.

నలుగురు నిందితులపై నమోదైన కేసులు

నలుగురు నిందితులపై 120(బి), 366, 506, 376-డి, 302, 201 ఆర్‌, డబ్ల్యు 34, 392 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరిన్ని సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించే పనిలో సైబరాబాద్‌ పోలీసులు నిమగ్నమయ్యారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక అందిన వెంటనే అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో గత జూన్‌లో 9 నెలల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసిన కేసులో మాదిరిగానే త్వరితగతిన తీర్పు వచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నిందితులను కస్టడీ ఇవ్వాలని ఇవాళ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details