ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

డీమార్ట్​లో ఇంటర్ విద్యార్థి మృతి... సిబ్బందిపై తల్లిదండ్రుల ఫిర్యాదు... - డీమార్టు సిబ్బంది దాడిలో ఇంటర్ విద్యార్థి మృతి

హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ వద్ద ఆదివారం రాత్రి... శ్రీచైతన్య కళాశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థి సతీశ్ మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు కొట్టిన దెబ్బలకే సతీశ్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్నేహితులతో కలిసి రాత్రి షాపింగ్‌కు వెళ్లిన సతీశ్‌కు డీమార్ట్ సెక్యూరిటీకి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సిబ్బంది జరిపిన దాడిలో సతీశ్​ చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపైనా ఫిర్యాదు చేశారు. సతీశ్‌ను తమ అనుమతి లేకుండా బయటకు పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

inter student died in hyderabad
డీమార్ట్​లో ఇంటర్ విద్యార్థి మృతి.. సిబ్బందిపై తల్లిదండ్రుల ఫిర్యాదు...

By

Published : Feb 17, 2020, 3:16 PM IST

డీమార్ట్​లో ఇంటర్ విద్యార్థి మృతి.. సిబ్బందిపై తల్లిదండ్రుల ఫిర్యాదు...

ఇదీ చదవండి:

గుడివాడలో విద్యుత్​ తీగలు తగిలి లారీ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details