ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు! - madhapur sot police arrested inter state gang

స్వగ్రామాల్లో వారు వ్యాపారస్థులు. అందరికీ ఆదర్శంగా ఉండే పెద్ద మనుషులు! కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం దొంగలు. అదేంటీ అనుకుంటున్నారా... అసలేం జరిగిందంటే...

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు!

By

Published : Oct 11, 2019, 11:24 PM IST

సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు!

దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణలోని మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, మధ్యప్రదేశ్​లో ఈ నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు. వారి నుంచి 60తులాల బంగారు, 2కిలోల వెండి ఆభరణాలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ, ఉత్తరాఖండ్​లోని వారి సొంత గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని సీపీ తెలిపారు. సంవత్సరంలో ఓ నెలరోజులు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చోరీలు చేస్తారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details