తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై గతంలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తి చెప్పులతో దాడి చేశాడు. తాజాగా.. అతనిపై దుండలుగు దాడి చేశారు. కే.గంగవరం మండలం మసకపల్లిలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధితుడిని పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.