ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణలో అనుమతులు లేకుండా అమ్ముతున్న ఆక్సిజన్​ సిలిండర్లు సీజ్ - హైదరాబాద్​లో ఆక్సిజన్​ సిలిండర్లు సీజ్

​కరోనా విస్తరిస్తున్న సమయంలో బాధితులకు ఆక్సిజన్ ఎంతో అవసరం. ఇదే అదునుగా కొంత మంది గుజరాత్ నుంచి అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను తెలంగాణలోని హైదరాబాద్​కు సరఫరా చేస్తున్నారు. ఇలా అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ లోని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు.

illegal oxygen cylinders seized in hyderabad
ఆక్సిజన్​ సిలిండర్లు సీజ్

By

Published : Jul 11, 2020, 6:39 PM IST

గుట్టుచప్పుడు కాకుండా ఇతరరాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆక్సిజన్​ సిలిండర్లను తెలంగాణ హైదరాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో బాధితులకు ఆక్సిజన్ ఎంతో అవసరమైన సందర్భాన్ని అదునుగా చేసుకున్న కొంత మంది గుజరాత్ వాసులు.. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను నగరానికి సరఫరా చేస్తున్నారు.

నగరంలోని గోల్కొండ పోలీస్​స్టేషన్ పరిధిలో అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న 33 ఏళ్ల ఒమర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 25 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఎవరెవరితో వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details