కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఆదివారం బళ్లారికి చెందిన ఇద్దరు వ్యక్తులు మల్లెపూల మధ్యన మద్యాన్ని ఉంచి.. కారులో విడపనకల్లు వైపుగా వచ్చారు. అక్కడి స్థానిక తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. పోలీసులు కారులోని మల్లెపూల సంచులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. వాటి మధ్యన 175 కర్ణాటక మద్యం సీసాలు లభ్యమయ్యాయని ఎస్‌ఐ గోపి చెప్పారు. ఆ మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
మల్లెల మాటున మద్యం..175 బాటిళ్లు స్వాధీనం - అనంతపురం నేర వార్తలు
అక్రమ మద్యాన్ని తరలించటానికి అక్రమార్కులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా కర్ణాటక మద్యాన్ని మల్లెపూల సంచుల్లో ఉంచి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 175 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రం మద్యం పట్టివేత
ఇవీ చదవండి:శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం