ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మద్యం పట్టివేత... అటవీ కార్యాలయ సిబ్బంది అరెస్ట్ - kurnool news

కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న 96 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అటవీ కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

illegal liquor seize in kurnool
కర్నూలులో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Jun 27, 2020, 10:50 AM IST


అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న అటవీ కార్యాలయ సిబ్బందిని కర్నూల్లో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు అరెస్టు చేశారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దనున్న ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ ఫోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా... ఓ కారును తనిఖీ చెయ్యగా... అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 96 మద్యం సీసాలు ఉన్నాయి. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా...ఓ వ్యక్తి పరారయ్యాడు.

పట్టుబడ్డ వ్యక్తులు కర్నూలు జిల్లా వెలుగోడు ఫారెస్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లుగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న డైరీ ఆధారంగా...పరారైన వ్యక్తి వెలుగోడు ఫారెస్టు కార్యాలయంలో బీట్ ఆఫీసర్ గా గుర్తించినట్లు ఎక్సైజ్ శాఖ సీఐ. లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:పూలచింత వద్ద కర్ణాటక మద్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details