తెలంగాణ ప్రాంతం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా ఆబ్కారీ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.
మాచర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిబ్బంది మాచర్ల పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రెంటచింతల ప్రాంతం వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు సంచితో ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. అనుమానం వచ్చిన ఆబ్కారీ సీఐ వాహనాన్ని తనిఖీ చేశారు. సంచిలో144 మధ్యం సీసాలు గుర్తించి సీజ్ చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సీఐ కొండారెడ్డితో పాటు ఎస్సై సురేంద్ర బాబు సిబ్బంది పాల్గొన్నారు.