తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శివారులో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు బోరుబండకు చెందిన హజీగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి లింగాయిపల్లికి చెందిన అశోక్‌ను సంగారెడ్డి ప్రభ్వుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఇద్దరు వ్యక్తులపై దుండగుల దాడి - sangareddy district murder today news
తెలంగాణలోని సంగారెడ్డిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడి చేయగా ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![తెలంగాణలో ఇద్దరు వ్యక్తులపై దుండగుల దాడి ఇద్దరు వ్యక్తులపై దుండగులదాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5974060-901-5974060-1580960140298.jpg)
ఇద్దరు వ్యక్తులపై దుండగులదాడి