ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భార్యపై భర్త హత్యాయత్నం​.. పరిస్థితి విషమం - husband murder attempt latest news

అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి చేసి పరారైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో చోటు చేసుకుంది.

మార్గమధ్యలో భార్యపై హత్యాయత్నం చేసిన భర్త​.. పరిస్థితి విషమం
మార్గమధ్యలో భార్యపై హత్యాయత్నం చేసిన భర్త​.. పరిస్థితి విషమం

By

Published : Oct 7, 2020, 11:10 PM IST

అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. పరారయ్యాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండల పరిధిలో జరిగింది. వాదాలగుంట గ్రామానికి చెందిన ఉర్ల రాంబాబుకు సుమాంజలికి 12 ఏళ్ల కిందట వివాహం కాగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఎస్సై సుబ్రహ్మమణ్యం తెలిపారు.

మనస్ఫర్థలు రాకుండా..

ఇటీవలే సుమాంజలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాంబాబుకు.. భార్యతో మనస్పర్ధలు వచ్చాయి. అనంతరం కలహాలు చెలరేగాయి. వారం రోజుల కిందట ఘర్షణ చోటుచేసుకోగా పెద్దల సమక్షంలో రాజీ పడ్డారు. ఇకపై ఘర్షణకు తావు లేకుండా కాపురం చేసుకుంటామని ఇద్దరూ అంగీకరించారు.

మార్గ మధ్యలో..

మంగళవారం చింతలపూడి రాంబాబు సోదరి ఇంటి వద్ద జరిగిన శుభకార్యంలో పాల్గొన్న దంపతులు బుధవారం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. మార్గం మధ్యలో గోపాలపురం మండలం కరిచర్లగూడెం సమీపంలోని మాతంగమ్మ మెట్ట వద్ద వాహనం ఆపిన రాంబూబు తన ద్విచక్ర వాహనంలో ఉన్న కత్తితో వెనక నుంచి సుమాంజలి తల, కాళ్లు, మెడపైన నరికి పరారయ్యాడు.

హుటాహుటిన..

తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలి కేకలకు పరిసర ప్రాంత వాసులు అక్కడకు చేరుకున్నారు. విషయం గ్రహించి ఆమెను హుటాహుటిన గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సుమాంజలి సోదరుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details