మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త హతమార్చిన సంఘటన హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద గౌతమ్, మహాలక్ష్మి దంపతులు యాచకులుగా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్య మహాలక్ష్మి ఎనిమిది నెలల గర్భవతి.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని... గర్భవతిని చంపిన భర్త - గాంధీ ఆస్పత్రి
గాంధీ ఆస్పత్రి సమీపంలో నిండు గర్భిణీ హత్యకు గురైంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యను భర్త కర్కశంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని... గర్భవతిని చంపిన భర్త
గౌతమ్ తరచూ డబ్బుల కోసం భార్యను హింసించేవాడు. ఇవాళ కూడా మద్యం కోసం డబ్బులు కావాలని అడగడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గౌతమ్ ఒక్కసారిగా మహాలక్ష్మిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గౌతమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.