ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అన్నం పెట్టలేదని గొంతు నులిమి... భార్యని చంపేశాడు! - wife murdered in meerpet

అన్నం పెట్టలేదని భార్యని చంపేశాడు ఓ భర్త. పెళ్లికి వెళ్లొచ్చిన భార్యని వంట చేయమని అడగగా ఆమె నిరాకరించింది. క్రమంగా వాగ్వాదం పెరిగి ఆగ్రహించిన ఆమె భర్త... చీరతో భార్య గొంతు నులిమేశాడు. హైదరాబాద్ మీర్​పేట్​లోని ప్రశాంత్ నగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.

husband-murdered
husband-murdered

By

Published : Dec 5, 2020, 4:03 PM IST

హైదరాబాద్​లోని మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్​లో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదనే కోపంతో భార్యను చంపేశాడు ఓ భర్త. జయమ్మ అనే మహిళ కొడుకుతో కలిసి వివాహానికి వెళ్లొచ్చింది. రాగానే తన భర్త శ్రీనివాస్ అన్నం వండమని, లారీ డ్రైవింగ్ పనికి పోయేది ఉందని చెప్పగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కోపంతో భార్య మెడను చీరతో నులిమి హతమార్చాడు శ్రీనివాస్ గౌడ్.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details