వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని... మూడు ముళ్లు వేసిన వాడే అతి కిరాతకంగా హతమార్చాడు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామానికి చెందిన కృష్ణయ్య, శాంతమ్మలకు 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణయ్యకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్యకు తెలిసి తరుచుగా గొడవలు జరుగుతుండేవి.
వివాహేతర సంబంధం విషయమై పెద్దల సమక్షంలో సర్ది చెప్పినా అతనిలో మార్పు రాలేదు. భార్య శాంతమ్మ అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. కూలీ పనికి వెళ్లిన శాంతమ్మను తన సోదరుడు వచ్చాడని చెప్పి... పొలం దగ్గరికి శనివారం సాయంత్రం తీసుకెళ్లాడు. అలా నమ్మించి తీసుకెళ్లి... పెద్ద కర్రతో తలపై కొట్టాడు.