అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త కొడవలితో గొంతుకోసి హత్యచేశాడు. ఆలకుంట భాస్కర్, అంజినమ్మ దంపతులు నార్పల మండల కేంద్రంలోని శక్తినగర్లో నివాసముంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమె తలపై రాడ్డుతో బాది, కొడవలితో కిరాతంగా గొంతు కోశాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. మద్యానికి బానిసై భాస్కర్ తన భార్యను తరచూ హింసించేవాడని బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - అనంతపురం జిల్లా తాజా వార్తలు
భార్య మీద అనుమానంతో భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. రాడ్డుతో ఆమె తలపై బలంగా బాదాడు. కొడవలితో గొంతుకోసి ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా నార్పలలో జరిగింది.
భార్యను హత్య చేసిన భర్త