ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అమెరికా నుంచి ఫోన్​లో ట్రిపుల్ తలాక్..! - husband gave talaq on phone

హైదరాబాద్​ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్​ కేసు వెలుగు చూసింది. అమెరికా నుంచి ఫోన్ చేసిన భర్త .. తలాక్​ చెప్పడం వల్ల న్యాయం కోసం బాధితురాలు విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది.

husband gave talaq on phone
అమెరికా నుంచి ఫోన్​లో ట్రిపుల్ తలాక్

By

Published : Dec 10, 2020, 3:05 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. పాతబస్తీకి చెందిన ఫాతిమాకు అమెరికాలో ఉన్న భర్త అబ్దివలీ అహ్మద్​ ఫోన్​ ద్వారా తలాక్ చెప్పాడు. సోమాలియా దేశస్థుడు అబ్దీవలీ అహ్మద్​కు అమెరికా పౌరసత్వం ఉంది. 2015లో చదువు నిమిత్తం హైదరాబాద్​ వచ్చిన అహ్మద్ హైదరాబాద్​ పాతబస్తీ గాజిమిల్లత్​ ప్రాంతానికి చెందిన ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. 6 నెలలకోసారి అహ్మద్ అమెరికా నుంచి హైదరాబాద్​కు వచ్చి వెళ్తుండేవాడు.

ఈ ఏడాది అక్టోబర్ 7న అమెరికా నుంచి అహ్మద్.. ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్​ చెప్పాడని బాధితురాలు ఫాతిమా తెలిపింది. ఎంబీటీ నేత అంజద్ ఖాన్ సాయంతో విదేశాంగ మంత్రికి బాధితురాలు తన గోడు విన్నవించుకుంది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చూడండి :జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details