ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... దంపతులు మృతి - road accident at vani[penta

కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో విషాదం నెలకొంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు.

husband and wife died in a road accident at vanipenta kadapa
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... దంపతులు మృతి

By

Published : Oct 26, 2020, 4:35 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. మైదకూర మండలం ఉత్సలవరం గ్రామానికి కత్తి చిన్న గుర్రప్ప- తిరుపతమ్మ దంపతులు.. వనిపెంటలో బ్యాంకు పని ముగించుకుని ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చిన్న గురప్పను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details