గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన తిరుమల రావు గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. వాడకంలో లేని ఓ నివాసాన్ని మద్యం తాగేందుకు అడ్డా మార్చుకున్నాడు. తన నివాసంలో మద్యం తాగుతున్నాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఇంటి యజమాని ఆరోగ్య రాజు.. ఆ వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
పక్కటెముకలో..
ఘటనలో తిరుమల రావు పక్కటెముకలో బీరు బాటిల్ గట్టిగా గుచ్చుకుంది. ఫలితంగా బాధితుడు కొంతదూరం నడుచుకుంటూ వచ్చి రక్తపు మరకలతోనే రోడ్డుపై పడిపోయాడు. గమంచిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఆరోగ్య రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నగరం పాలెం సీఐ మల్లికార్జున రావు వెల్లడించారు.
ఇవీ చూడండి :
ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి