ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పరువు హత్య.. అల్లుణ్ని చంపించిన మామ - హేమంత్​ హత్య కేసు

ప్రేమ, కులాంతర వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, బంధువులు... ఎలాగైన తమ కుమార్తెను పెళ్లి చేసుకున్న యువకుడిని అంతమొందించాలని భావించారు. యువతితో సన్నిహితంగా ఉంటూనే కుటుంబసభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం కిరాయి హంతకులతో కలిసి దారుణానికి ఒడిగట్టారు. యువకుడిని హత్య చేయించారు. తప్పించుకోవాలని భావించినప్పటికీ... సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు వారిని పట్టుకున్నారు. సంచలనం సృష్టించిన అపహరణ, హత్య కేసులో పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు.

పరువు హత్య.. అల్లుణ్ని చంపించిన మామ
పరువు హత్య.. అల్లుణ్ని చంపించిన మామ

By

Published : Sep 26, 2020, 6:04 AM IST

వారిద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. పరస్పరం ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. పోలీసులను ఆశ్రయించడంతో ఇరువురి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు అవంతి, హేమంత్‌ గచ్చిబౌలి ఎన్జీవోస్‌ కాలనీలో వేరు కాపురం పెట్టారు. అయితే అవంతితో ఆమె తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. మరో వైపు అదును కోసం వేచి చూశారు. కుమార్తెను వివాహం చేసుకున్న హేమంత్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రమేయం లేకుండా బిచ్చు యాదవ్‌, ఎరుకల కృష్ణతో పది లక్షల రూపాయలతో కిరాయి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాశవికంగా హత్య చేశారు..

కిరాయి హత్య విషయం అవంతి తల్లిదండ్రులతో పాటు మరికొందరు కుటుంబసభ్యులకు ముందుగానే తెలుసు. ఈ నేపథ్యంలో దంపతులు నివసిస్తున్న ఎన్జీవోస్‌ కాలనీకి మూడు కార్లలో వచ్చిన కుటుంబసభ్యులు హంతకులు అవంతితో పాటు ఆమె భర్త హేమంత్‌ను అపహరించారు. ఈ క్రమంలో కారు కొద్ది దూరం వెళ్లగానే అవంతి వాహనం నుంచి కిందకు దూకేసింది. మరో కారులో ఉన్న హేమంత్‌ కూడా కిందకు దూకగానే... యుగంధర్‌ అతన్ని వెంబడించి పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేశాడు. కేకలు వేయకుండా అతని నోరు అదిమి పట్టారు. సంగారెడ్డి చేరుకున్నాక తాడుతో హేమంత్‌ మెడకు ఉరి బిగించిన కిరాయి హంతకులు పాశవికంగా అంతం చేశారు. అప్పటికే బాధితులు అపహరణ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వారు అప్రమత్తమై గాలింపు చేపట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యుగంధర్... పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేసి హేమంత్‌ను హత్య చేసినట్టు తెలిపాడు. దీంతో సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కిరాయి హంతకులతో పాటు యువతి మేనమామను అరెస్టు చేశారు.

తదితర కోణాల్లో దర్యాప్తు

నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని ఆస్తి వివాదాలు, కులాంతర వివాహం తదితర అంశాల కోణాల్లో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు.

ఇవీ చూడండి: కూతురి ప్రేమ.. తండ్రి కోపం.. ఆ యువకుడి ప్రాణం తీసింది!

ABOUT THE AUTHOR

...view details