ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భారీగా చౌక బియ్యం పట్టివేత...నలుగురి అరెస్టు - ప్రొద్దుటూరు వార్తలు

ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు.

Heavy rice seized  in Proddatur
ప్రొద్దుటూరులో భారీగా చౌక బియ్యం పట్టివేత

By

Published : Oct 2, 2020, 12:26 PM IST


పేదల బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారి నుంచి 318 బస్తాల బియ్యం, లారీ, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

చౌక బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో... ఎంజీ ఆటోనగర్​లోని మధు రెడ్డి రైస్ మిల్లు వద్ద చౌక బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:
నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

ABOUT THE AUTHOR

...view details